కేసీఆర్ ప్రధాని అయితే దేశం అమెరికాలా దూసుకుపోతుంది: మహమూద్ అలీ

17-02-2020 Mon 07:16
  • నేడు కేసీఆర్ జన్మదినం
  • నిన్న దివ్యాంగులకు ఉప కరణాల పంపిణీ
  • దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందన్న హోం మంత్రి
Telangana minister Mahamood Ali praises CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని అయితే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నేడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘కేసీఆర్ సేవా మండలి’ ఆధ్వర్యంలో నిన్న తెలంగాణ భవన్‌లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ అలీ మాట్లాడుతూ.. దేశంలో కేసీఆర్‌ను మించిన సెక్యులర్ నాయకుడు మరొకరు లేరని కొనియాడారు. సంక్షేమం విషయంలో ఎన్టీఆర్ తర్వాత కేసీఆరేనని ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ ప్రధాని అయితే అభివృద్ధిలో దేశం అమెరికాలా పరుగులు పెడుతుందని అన్నారు. దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని మహమూద్ అలీ అన్నారు.