పెద్దల సభకు ప్రియాంక గాంధీ?

16-02-2020 Sun 21:48
  • రాజ్యసభలో ఖాళీ కానున్న 68 సీట్లు
  • వాటిలో కాంగ్రెస్ కోల్పోయేది 19 సీట్లు
  • అందులో పదింటిని కాంగ్రెస్ మళ్లీ గెలిచే అవకాశం
Will Priyanka Gandhi make maiden Rajyasabha entry

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చట్టసభలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియాంకను కాంగ్రెస్ అధినాయకత్వం రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దల సభలో మొత్తం 245 స్థానాలు ఉండగా, మరికొన్ని నెలల్లో 68 సీట్లు ఖాళీ అవుతాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు కోల్పోనుంది.

అయితే, మిత్రపక్షాల సాయంతో వాటిలో పదింటిని కాంగ్రెస్ మళ్లీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. తాము అధికారంలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ కు పెద్దగా అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లోనే ఓ రాష్ట్రం నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపవచ్చని భావిస్తున్నారు. ప్రియాంకతో పాటు రణదీప్ సూర్జేవాలా, జ్యోతిరాదిత్య సింధియాలను కూడా రాజ్యసభకు పంపనున్నట్టు తెలుస్తోంది.