జగన్ ఇంతగా దిగజారిపోతారనుకోలేదు!: పంచుమర్తి అనూరాధ

16-02-2020 Sun 21:29
  • వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన యువకుడిని అరెస్ట్  చేస్తారా?
  • అతనిపై అక్రమ కేసు పెడతారా?
  • బాధితుడు విజయ్ కు తాము అండగా ఉంటాం
 Panchumarthi Anuradha says that I never imagine Jagan is this much worst

బీసీ, ఎస్సీల నిధులను ‘అమ్మఒడి’ పథకానికి మళ్లించారంటూ పోస్ట్ చేసిన విజయ్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టడంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మండిపడ్డారు. అతనిపై అక్రమ కేసు పెడతారా? బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఉగ్రవాదిలా భావించి అతని ముఖానికి ముసుగు వేస్తారా? అంటూ మండిపడ్డారు. బాధితుడు విజయ్ కు తాము అండగా ఉంటామని, పోలీసులపై కేసులు పెడతామని హెచ్చరించారు. సీఎం జగన్ ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదంటూ విమర్శల వర్షం కురిపించారు.