ఆదిలాబాద్ లో మళ్లీ పెద్దపులి దాడి.. పులి కోసం అడవిలోకి వెళ్లిన గ్రామస్తులు!

Sun, Feb 16, 2020, 07:47 PM
Adilabad District villagers has gone to
  • తాంసి (కె), భీంపూర్ లలో మళ్లీ సంచరించిన పెద్దపులి
  • తాంసి (కె) లో రెండు ఆవులపై దాడి
  • పులి కోసం గాలిస్తూ అడవిలోకి వెళ్లిన 200 మంది గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి (కె), భీంపూర్ లలో పెద్దపులి మళ్లీ సంచరించింది. రెండు ఆవులపై దాడి చేసింది. ఈ ఘటనతో ఫారెస్ట్ అధికారులపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సుమారు రెండు వందల మంది గ్రామస్తులు పులి కోసం గాలిస్తూ అడవిలోకి వెళ్లారు. అడవిలోకి వెళ్లొద్దని  అటవీశాఖాధికారులు చెప్పిన గ్రామస్తులు పట్టించుకోకుండా వెళ్లినట్టు సమాచారం.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad