Corona Virus: మరో ఇద్దరు ఇండియన్లకు కరోనా.. జపాన్ షిప్ లో 355కు చేరిన బాధితుల సంఖ్య

  • వైరస్ సోకినవారిలో ఐదుగురు ఇండియన్లు
  • 17వ తేదీ నుంచి అందరికీ పలుమార్లు పరీక్షలు
  • వైరస్ లేని వారిని బయటికి పంపాలని నిర్ణయం
Two More Indians Test Positive For Coronavirus On Quarantined Japan ship

జపాన్ సముద్ర జలాల్లో నిలిపేసి ఉంచిన భారీ క్రూయిజ్ షిప్ లో ఉన్న ఇండియన్లలో మరో
ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. మొత్తంగా ఆ షిప్ లో ఉన్నవారిలో
ఐదుగురు ఇండియన్లు సహా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 355కు పెరిగినట్టు
ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎంత మంది ఉన్నారు?

జపాన్ కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో మొత్తం 3,711 మంది ఉన్నారు.
అందులో 132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు భారతీయులే. హాంకాంగ్, చైనా
మీదుగా జపాన్ కు వెళ్లిన ఆ షిప్ ను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సముద్ర తీరానికి
కొంత దూరంలోనే ఆపేసి ఉంచారు. వారిని దిగనిస్తే ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి
చెందుతుందని జపాన్ ఈ చర్యలు తీసుకున్నారు. తొలుత కొందరు వైరస్ బాధితులను
గుర్తించగా.. తర్వాత వారి సంఖ్య మరింతగా పెరిగింది. గత రెండు రోజుల్లోనే కొత్తగా 137
మందికి వైరస్ సోకింది.

More Telugu News