ఫైనల్ గా విజయ్ పులివెందుల పులి, జగన్ పిల్లి: నారా లోకేశ్

16-02-2020 Sun 18:31
  • ‘కేంద్రం మెడలు వంచేస్తా’ అన్న వస్తాదు ఈ పోస్ట్ లకు భయపడమేంటి?
  •  జగన్ దగ్గర మార్కులు కోసం అధికారుల అత్యుత్సాహం తగదు
  • విజయ్ కుమార్ రెడ్డికి నేను అండగా ఉంటాను
Nara lokesh starires on Jagan

వైసీపీ ప్రభుత్వం తీరును విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ విషయమై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘కేంద్రం మెడలు వంచేస్తా’ అన్న వస్తాదు సోషల్ మీడియా పోస్టులకు భయపడటం ఏంటి?  అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ఒక యువకుడు వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచాడని, ఆ వీడియోని పోస్ట్ చేసినందుకు, బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని పోస్ట్ పెట్టినందుకు పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ విషయమై విమర్శలు కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెడతారా?అంత పెద్ద తప్పు ఏం చేశాడు?  అని ప్రశ్నించారు.

జగన్ దగ్గర మార్కులు కోసం అధికారుల అత్యుత్సాహం తగదని, కోర్టులు చీవాట్లు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. ‘విజయ్ కుమార్ రెడ్డికి నేను అండగా ఉంటాను’ అని, అతను పోస్ట్ చేసిన వీడియోను తాను కూడా పోస్ట్ చేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.