ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి కన్నుమూత

16-02-2020 Sun 16:19
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వర్ రెడ్డి
  • స్విమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
  • అప్పట్లో ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓటమిపాలైన అగరాల
AP assembly former speaker Agarala Easwar Reddy died

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన సీనియర్ రాజకీయవేత్త అగరాల ఈశ్వర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వర్ రెడ్డి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా తూకివాకం. గ్రామ సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన అగరాల, అనంతరం కాలంలో ఎమ్మెల్యేగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా వ్యవహరించారు. అయితే, 1983లో టీడీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. తిరుపతిలో ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓటమి చవిచూశారు.