'నాయక్‌' హీరో అనిల్ కపూర్‌... 'నాయక్‌-2' కేజ్రీవాల్‌... అబ్బుర పరిచేలా ఫొటోలు.. వైరల్

16-02-2020 Sun 11:06
  • కాసేపట్లో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
  • రామ్‌లీలా మైదానంలో కోలాహలం
  • అభిమానులు, కళాకారుల సందడి
kejriwal oath take ceremony

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానాన్ని ఆప్ నేతలు, కార్యకర్తలు ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది.

అక్కడ ఏర్పాటు చేసిన పోస్టర్లు అబ్బురపరుస్తున్నాయి. 'నాయక్‌-2 మళ్లీ వచ్చేశారు' అంటూ ఓ పోస్టర్ వెలసింది. అందులో 'నాయక్‌ అనిల్ కపూర్‌ అయితే.. నాయక్‌-2 కేజ్రీవాల్‌' అని పేర్కొన్నారు. బాలీవుడ్‌ నాయక్ సినిమాలో అనిల్‌ కపూర్‌ ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అవినీతిపై పోరాడతాడు. చివరకు పూర్తి స్థాయి సీఎం అవుతాడు. అర్జున్‌ నటించిన 'ఒకేఒక్కడు' సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది.
                
మరోవైపు, ఆమ్‌ ఆద్మీ కార్యకర్తలు, కళాకారులు రామ్‌లీలా మైదానంలో సందడి చేస్తున్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున అచ్చం అరవింద్ కేజ్రీవాల్ స్టయిల్ లో వచ్చి అందరినీ ఆకట్టుకున్న ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ ప్రమాణ స్వీకారానికి వచ్చి మరోసారి సందడి చేయనున్నాడు.