హైదరాబాద్ ఎగ్జిబిషన్ 'నుమాయిష్' పొడిగింపు!

16-02-2020 Sun 09:39
  • ఫిబ్రవరి 15తో ముగియాల్సిన ప్రదర్శన
  • 18 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటన
  • ఇంతవరకూ సందర్శించిన 18 లక్షల మంది
Numaish Extended 3 more days

హైదరాబాద్, నాంపల్లిలో జరుగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 'నుమాయిష్'ను 18వ తేదీ వరకు పొడిగించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతియేటా, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. ఎగ్జిబిషన్ ను పొడిగించాలని స్టాల్స్ నిర్వాహకులు విజ్ఞప్తి చేయడంతో, ఎగ్జిబిషన్‌ సొసైటీ అందుకు సానుకూలంగా స్పందించింది. అనుమతి ఇవ్వాలని న్యాయస్థానం, పోలీస్‌, ఫైర్‌, విద్యుత్‌ శాఖలకు విజ్ఞప్తి చేసింది.

సొసైటీ నుంచి అందిన విన్నపాన్ని పరిశీలించిన అనంతరం, 18వ తేదీ వరకూ అంటే, మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్ ను పొడిగించేందుకు అనుమతి లభించిందని సొసైటీ కోశాధికారి వినయ్‌ కుమార్‌ తెలిపారు. నుమాయిష్‌ ను ఇంతవరకూ 18 లక్షల మంది సందర్శించారని ఆయన అన్నారు.