మంత్రిని గుర్తించకుండా అడ్డుకున్న పోలీసు అధికారి.. చిందులేసిన అమాత్యుడు!

16-02-2020 Sun 09:26
  • ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి
  • గుర్తించని సబ్ డివిజినల్ పోలీస్ అధికారి
  • సస్పెండ్ చేయాలని ఆదేశించిన మంత్రి
Bihar minister fires on police officer video viral

ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తనను గుర్తించకపోవడమే కాకుండా అడ్డుకున్న పోలీసు అధికారిపై ఆయన చిందులేశారు. మంత్రినే గుర్తించలేని ఇలాంటి వారిని ఎలా నియమిస్తారంటూ నిప్పులు చెరిగారు. బీహార్‌లో జరిగిందీ ఘటన. సివాన్ నగరంలోని ఓ ఆసుపత్రి శంకుస్థాపనకు ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, అమాత్యుడిని గుర్తించని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మంత్రిని అడ్డుకున్నారు. అంతే, ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. మంత్రిని గుర్తించలేని ఇలాంటి వారిని ఎందుకు నియమిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, విధుల నుంచి అతడిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ ఘటనను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.