Karnataka: కర్ణాటకలో ఇంజినీరింగ్ విద్యార్థుల ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు.. అరెస్ట్

  • హుబ్బళ్లిలోని కేఎల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులు
  • పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా పాక్ అనుకూల నినాదాలు
  • కళాశాల నుంచి సస్పెన్షన్.. అరెస్ట్
Kashmir Students chant Pakistan pro slogans

కర్ణాటకలోని హుబ్బళ్లిలో కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడం కలకలం రేపింది. స్థానిక కేఎల్ ఇంజనీరింగ్ కళాశాలలో కొందరు కశ్మీరీ విద్యార్థులు చదువుకుంటున్నారు. పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా అమీర్, బాసిత్, తాలీబ్ అనే విద్యార్థులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇది చూసిన భజరంగ్‌దళ్ కార్యకర్తలు నిన్న కళాశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. పాక్ అనుకూల నినాదాలు చేసిన వీరిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కళాశాల యాజమాన్యం వీడియో ఆధారంగా పాక్ అనుకూల నినాదాలు చేసిన ముగ్గురినీ సస్పెండ్ చేసినట్టు తెలిపింది. అంతేకాదు, వారిపై పోలీసులకూ ఫిర్యాదు చేసింది. దీంతో అమీర్, బాసిత్, తాలీబ్‌లను అరెస్ట్ చేసినట్టు  హుబ్లీ-దార్వాడ పోలీసు కమిషనర్‌ తెలిపారు.

More Telugu News