Tirumala: పెరిగిన చలితో తిరుమలలో ఇబ్బందులు!

  • అద్దె గదులు దొరక్క అవస్థ
  • భక్తుల రద్దీ సాధారణం
  • శనివారం నాడు రూ. 2.52 కోట్ల హుండీ ఆదాయం
Tirumala Piligrims Sufers form Cold

పెరిగిన చలి తీవ్రతతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె గదులు దొరకని వారు పిల్లా పాపలతో షెడ్ల కిందే తలదాచుకోవాల్సి రావడంతో చలిలో అల్లాడుతున్నారు. ఇక ఈ ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, దర్శనానికి ఆరు నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్ పొందిన వారికి 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. నిన్న స్వామివారిని సుమారు 70 వేల మంది భక్తులు దర్శించుకోగా, రూ. 2.52 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

More Telugu News