Mumbai: తాను వెళ్లాలనుకున్న ప్రదేశానికే ఆటో వెళుతుందన్న డ్రైవర్... భయంతో దూకేసిన యువతి

  • ముంబయిలో ఘటన
  • పంచరత్న వెళ్లేందుకు ఆటో ఎక్కిన యువతి
  • కీచకావతారం ఎత్తిన ఆటో డ్రైవర్
  • ఆటోలోంచి దూకడంతో యువతికి తీవ్రగాయాలు

ముంబయిలో ఓ యువతి కీచకుడి బారి నుంచి గాయాలతో తప్పించుకుంది. ఆ యువతి పంచరత్న ఏరియాకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటో కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఆ డ్రైవర్ లోని మృగం నిద్రలేచింది. అద్దంలోంచి ఆమెనే చూస్తూ ఆటో తాను వెళ్లాలనుకున్న ప్రాంతానికే వెళుతుందని అన్నాడు.

అతడి మనసులోని దురాలోచన అర్థమైన యువతి వణికిపోయింది. అంతలోనే అతడు ఆమె వెళ్లాల్సిన రూట్ కాకుండా మరో మార్గంలోకి ఆటోను మళ్లించాడు. దాంతో ఆ యువతి భయంతో దూకేసింది. ఈ క్రమంలో ఆమె తలకు గాయాలయ్యాయి. తల రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ కు బలంగా తాకింది. రోడ్డుపై వెళుతున్న వాళ్లు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కీచకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News