నమాజ్ వినిపించడంతో ప్రసంగం ఆపేసిన పవన్ కల్యాణ్

15-02-2020 Sat 19:44
  • రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన
  • రైతులు, మహిళలకు సంఘీభావం ప్రకటించిన పవన్
  • మందడంలో నమాజ్ పూర్తయ్యేకే ప్రసంగం కొనసాగించిన వైనం
Pawan stops speech as Namaz begins

జనసేనాని పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలను కలుసుకుంటూ వారి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మందడంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతుండగా నమాజ్ వినిపించింది. దాంతో పవన్ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. కాసేపు మౌనం పాటించారు. నమాజ్ పూర్తయిన తర్వాతే ప్రసంగం మళ్లీ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాజధానిలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పేందుకు ఈ నమాజ్ బలమైన ఉదాహరణ అని అన్నారు.