పవన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణకి సన్నాహాలు చేస్తున్న క్రిష్

15-02-2020 Sat 16:01
  • చారిత్రక నేపథ్యంలో క్రిష్ సినిమా
  • పవర్ఫుల్ పాత్రలో పవన్ కల్యాణ్  
  •  పరిశీలనలో 'విరూపాక్ష' టైటిల్
Viroopaksha Movie

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఎ.ఎమ్.రత్నం ఒక సినిమాను నిర్మించాలనుకున్నాడు. ఈ సినిమాకి 2016లోనే పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. ఆ తరువాత కొన్ని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఈ నెల 18వ తేదీ (మంగళవారం) నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. పవన్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆంగ్లేయులను దోచుకునే బందిపోటు పాత్రలో పవన్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. పవన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దడం వలన, ఆ పాత్రకి తగినట్టుగా 'విరూపాక్ష' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. టైటిల్ తో పాటు కథానాయిక విషయంలోను త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.