విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి?

15-02-2020 Sat 15:57
  • ఎన్టీయేలోకి వైసీపీ చేరబోతోందనే ప్రచారం
  • వైసీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం?
  • విజయసాయికి నౌకాయానశాఖను అప్పగిస్తారని ప్రచారం
Vijayasai Reddy may gets berth in union cabinet

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్డీయేలోకి వైసీపీ చేరబోతోందని, ఈ విషయంపై మోదీతో చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. వైసీపీకి రెండు లేదా మూడు మంత్రి పదవులు దక్కబోతున్నాయనేదే ఆ వార్త. వైసీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కనున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీలో కీలక నేత అయిన విజయసాయిరెడ్డికి నౌకాయానశాఖను అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అనురాధకు కేంద్ర సహాయ మంత్రి ఇవ్వచ్చనే చర్చ జరుగుతోంది.