‘పరారే’ ఫేం హీరో ఉదయ్ కిరణ్ ఆకస్మిక మృతి!

15-02-2020 Sat 15:53
  • కాకినాడలో మృతి చెందిన నండూరి ఉదయ్ కిరణ్
  • నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటు
  • ఉదయ్ కిరణ్ మృతిపై పలువురు సంతాపం
Parare movie Young Hero Uday kiran sudden death

టాలీవుడ్ యువనటుడు నండూరి ఉదయ్ కిరణ్ (34) ఆకస్మికంగా మృతి చెందాడు. కాకినాడలో నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్టు సమాాచారం. ఉదయ్ పార్థివ దేహాన్ని సందర్శించిన పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఉదయ్ కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలిపారు.  

కాగా, ‘పరారే’, ‘ఫ్రెండ్స్ బుక్’  తెలుగు చిత్రాల్లోను, మరికొన్ని తమిళ సినిమాల్లోను కూడా ఉదయ్ కిరణ్ నటించాడు. గతంలో ఉదయ్ పై పలు ఆరోపణల కారణంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నాలుగేళ్ల క్రితం అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.