నితిన్ సార్... నేను మీకు చాలా లక్కీ: రష్మిక

15-02-2020 Sat 15:05
  • త్వరలో శాలినితో హీరో నితిన్ వివాహం
  • శుభాకాంక్షలు తెలిపిన హీరోయిన్ రష్మిక
  • ఎంతో సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యలు
Actress Rashnika Mandanna comments on Hero Nithin marriage

టాలీవుడ్ హీరో నితిన్ తన ప్రేయసి శాలినితో కలిసి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. సుదీర్ఘకాలం పాటు సాగిన తమ ప్రేమను పెళ్లితో అందమైన మలుపు తిప్పనున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్లిమ్ బ్యూటీ రష్మిక మందన్న స్పందించింది.

"కంగ్రాచ్యులేషన్స్ నితిన్ సార్! చూడండి, నేను మీకు ఎంత అదృష్టం తీసుకువచ్చానో! మీరు నాతో నటిస్తున్నారో లేదో ఓ ఇంటివారు కాబోతున్నారు. మీ ఇద్దరూ పెళ్లితో ఒక్కటవుతుండడం పట్ల ఎంత సంతోషంగా ఉన్నానో!" అంటూ రష్మిక ట్వీట్ చేసింది. ప్రస్తుతం నితిన్ భీష్మ అనే చిత్రం చేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రష్మికే హీరోయిన్. అందుకే ఈ సరదాగా ఈ ట్వీట్ చేసింది.