రొమాంటిక్ మూవీగా 'కృష్ణ అండ్ హిస్ లీల' .. టీజర్ రిలీజ్

15-02-2020 Sat 12:20
  • సిద్ధూ హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  • 'క్షణం' దర్శకుడి నుంచి రెండో సినిమా 
  •  వేసవిలో విడుదల చేసే ఆలోచన  
Krishna And His Leela Movie

తెలుగులో రొమాంటిక్ చిత్రాల జోరు కొనసాగుతోంది. ముగ్గురు కథానాయికలకి తక్కువ కాకుండా తెరపై అందాల సందడి చేస్తున్నారు. అదే తరహాలో రూపొందిన మరో రొమాంటిక్ ఎంటర్టైనరే 'కృష్ణ అండ్ హిస్ లీల'. 'క్షణం' చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

'గుంటూరు టాకీస్' ఫేమ్ సిద్ధూ హీరోగా, సురేశ్ ప్రొడక్షన్స్ - వయాకామ్ 18 ఈ సినిమాను నిర్మించింది. శ్రద్ధా శ్రీనాథ్ .. షాలిని .. శీరత్ కపూర్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రీలీజ్ చేశారు. ముగ్గురు కథానాయికలతో కథానాయకుడు నడిపే ప్రేమాయణం ప్రధానంగా సాగే సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.