యథార్థ సంఘటనల ఆధారంగా 'అమ్మ దీవెన' .. ట్రైలర్ రిలీజ్

15-02-2020 Sat 11:09
  • ఆమని ప్రధాన పాత్రగా 'అమ్మ దీవెన'
  • కీలకమైన పాత్రలో సత్య ప్రకాశ్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
Amma deevena Movie

నిన్నటితరం కథానాయికలలో ఆమని స్థానం ప్రత్యేకం. ప్రస్తుతం ప్రాధాన్యతగల పాత్రలను ఆమె చేస్తూ వస్తున్నారు. ఆమె కీలకమైన పాత్రను పోషించిన చిత్రంగా 'అమ్మ దీవెన' రూపొందింది. 'జగద్గిరిగుట్ట'లో 1980 ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు.

ఈ ట్రైలర్ లో లక్ష్మమ్మ అనే పాత్రలో ఆమని కనిపిస్తోంది. తాగుబోతు భర్త .. ఐదుగురు పిల్లలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు .. రాబందుల వంటి బంధువులు .. ఈ పరిస్థితులను ఆమె ఎలా అధిగమించింది? లక్ష్మమ్మ తరువాత ఆమె ఆశయాన్ని నెరవేర్చడానికి రంగంలోకి దిగింది ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ వలన అర్థమవుతోంది. పోసాని .. సత్య ప్రకాశ్ .. శరణ్య ప్రదీప్ ముఖ్యమైన పాత్రల్లో కనిపంచనున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.