ఇండియాలో అతిపెద్ద రోడ్ షోను కలిసి చేయనున్న ట్రంప్, మోదీ!

15-02-2020 Sat 10:52
  • ఈ నెల చివరి వారంలో ట్రంప్ పర్యటన
  • అహ్మదాబాద్ లో 22 కిలోమీటర్ల ర్యాలీ
  • ఆపై మొతేరాలో భారీ బహిరంగ సభ
Trump and Modi Road show in Ahmadabad later this month

ఈ నెల చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి భారత్ లో పర్యటించనుండగా, అహ్మదాబాద్ లో 22 కిలోమీటర్ల మేర జరిగే రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారని నగర మేయర్ బిజాల్ పటేల్ వ్యాఖ్యానించారు. దారి పొడవునా దాదాపు 50 వేల మంది వారికి స్వాగతం పలుకుతారని, ఇంత అధిక దూరం ప్రజలు నిలబడే అతిపెద్ద రోడ్ షో ఇదే కావచ్చని ఆయన అన్నారు. ఈ రోడ్ షోకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హాజరై, తమతమ సంప్రదాయ ఆహార్యంలో కనిపిస్తారని ఆయన అన్నారు.

కాగా, తన పర్యటనలో భాగంగా ట్రంప్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఈ ఆశ్రమంతో మహాత్మా గాంధీకి ఎంతో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆపై ట్రంప్, మోదీలు మొతేరాలో నిర్మించిన క్రికెట్ స్టేడియానికి చేరుకుని, అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.