అనంతపురం జిల్లాలో వైసీపీ మంత్రికి చేదు అనుభవం

15-02-2020 Sat 10:31
  • సోమందేపల్లిలో మంత్రి శంకర్ నారాయణకు వ్యతిరేకంగా రైతుల నిరసన
  • భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి మాట తప్పారంటూ ఆగ్రహం
  • రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
YSRCP minister in Anantapur district faces bitter experience

ఏపీ మంత్రి శంకర్ నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో మంత్రికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి... అధికారంలోకి రాగానే మాట తప్పారని ఈ సందర్భంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.