Suryapet District: దాక్కున్నా విడిచి పెట్టలేదు...అర్ధరాత్రి టీఆర్‌ఎస్‌ నేత హత్య!

  • సూర్యాపేట మండలం యార్కారంలో దారుణం
  • సహకార సంఘ ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా ప్రత్యర్థుల దాడి
  • తల్వార్లు, గొడ్డళ్లతో వెంబడించి మరీ హత్య
TRS Ex sarpanch murdered

సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒంటెద్దు వెంకన్న దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి ప్రత్యర్థులు తల్వార్లు, గొడ్డళ్లతో దాడిచేసి అత్యంత కిరాతంగా చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన వెంకన్న మాజీ సర్పంచ్‌. సహకార సంఘం ఎన్నికలు జరగాల్సి ఉండడంతో నిన్న రాత్రి కార్యకర్తలతో కలిసి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయిస్తున్నారు.

ఈ సమయంలో ప్రత్యర్థులు వెంకన్నపై దాడికి వచ్చారు. దీన్ని గుర్తించిన వెంకన్న ప్రాణభయంతో పారిపోయి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. వెంబడించిన ప్రత్యర్థులు వెంకన్న ఆ ఇంటిలో ఉన్నట్లు గుర్తించి తలుపులు పగులగొట్టి మరీ లోపలికి ప్రవేశించారు.

వెంకన్నపై తల్వార్లు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.

More Telugu News