సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

15-02-2020 Sat 07:23
  • నయన్ ప్రియుడి చిత్రంలో సమంత!
  • నితిన్ సినిమా వేడుకకు త్రివిక్రమ్ 
  • నాగశౌర్య నటించే మరో చిత్రం
Samantha to work with Vighnesh Shivan

 *  టాప్ హీరోయిన్లు నయనతార, సమంత కలసి ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించే ఈ చిత్రానికి నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముక్కోణపు ప్రేమకథగా రూపొందే ఈ చిత్రానికి 'కాత్తువక్కుల రెందు కాదల్' అనే టైటిల్ని నిర్ణయించారు.  
*  నితిన్ హీరోగా రూపొందిన 'భీష్మ' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 17న నిర్వహిస్తున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్టుగా విచ్చేస్తారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.
*  ప్రస్తుతం కీర్తి సురేశ్ తో 'మిస్ ఇండియా' చిత్రాన్ని నిర్మిస్తున్న మహేశ్ కోనేరు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తాడు. రాజా దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలోనే మొదలవుతుంది.