Tirumala: తిరుమల అశ్విని ఆసుపత్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైవీ

  • తిరుమల పుణ్యక్షేత్రంలో అశ్విని ఆసుపత్రికి మరిన్ని హంగులు
  • రూ.4 కోట్ల ఆర్థికసాయం అందించిన టాటా ట్రస్ట్
  • రోగులకు మరింత మెరుగైన సేవలు
YV Subba Reddy inaugurates revamped Ashwini hospital

తిరుమల పుణ్యక్షేత్రంలో ఇప్పటికే సేవలు అందిస్తున్న అశ్విని ఆసుపత్రిని టాటా ట్రస్ట్ సహకారంతో మరింత ఆధునికీకరించారు. సరికొత్తగా ముస్తాబైన అశ్విని ఆసుపత్రిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టాటా ట్రస్ట్ రూ.4 కోట్ల ఆర్థికసాయం అందించగా, ఆధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేశారు. దీనికితోడు టీటీడీ రూ.65 లక్షలతో ఆసుపత్రి పరిసరాలను అభివృద్ధి చేసింది.

టాటా ట్రస్ట్ సహకారంతో ఇక్కడ కేన్సర్ స్క్రీనింగ్, కేన్సర్ చికిత్స అందించనున్నారు. అపోలో ఆసుపత్రి సౌజన్యంతో హృద్రోగ సంబంధ చికిత్స అందిస్తున్నట్టు వైవీ తెలిపారు. గతంలో అశ్విని ఆసుపత్రిలో ప్రాథమిక పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ కు పంపించేవారు. ఇకపై చికిత్స అంతా అశ్విని ఆసుపత్రిలోనే అందిస్తారు. 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో 2 ఐసీయూలు, ఓ మినీ ఆపరేషన్ థియేటర్, సరికొత్త ల్యాబ్ ఉన్నాయి.

More Telugu News