ఏపీలో ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

14-02-2020 Fri 17:37
  • పురుష ఓటర్లు  కోటి 97 లక్షల 21 వేలు
  • మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 2 లక్షల 4 వేల 378
  • ట్రాన్స్ జెండర్లు 4,066

ఏపీలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో  పురుష ఓటర్లు కోటి 97 లక్షల 21 వేలు, మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 2 లక్షల 4 వేల 378 అని, ట్రాన్స్ జెండర్లు 4,066, ఎన్ఆర్ఐ ఓటర్లు 7,436 అని పేర్కొంది. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 1,63,030 అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు.