Sajjala Ramakrishna Reddy: పీఎస్ నివాసంలోనే రూ.2 వేల కోట్లు దొరికితే బాబును విచారిస్తే రూ.2 లక్షల కోట్లు బయటపడతాయి: సజ్జల

  • ఏపీలో ఐటీ దాడులపై సజ్జల స్పందన
  • ఓ చిన్న తీగ లాగితే రూ.2 వేల కోట్లు వచ్చాయని వెల్లడి
  • డొంక చాలా పెద్దదని అర్థమవుతోందని వ్యాఖ్యలు
Sajjala comments on Chandrababu over IT raids

ఏపీలో ఐటీ దాడుల అంశం మరింత రాజుకుంది. ముఖ్యంగా, చంద్రబాబు మాజీ పీఎస్ పెండాల్య శ్రీనివాస్ నివాసంలో ఆరు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు జరిపిన అంశంపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు.

ఓ చిన్న తీగ లాగితే రూ.2 వేల కోట్లు బయటికి వచ్చాయని, దీన్నిబట్టే డొంక చాలా పెద్దదని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఓ పీఎస్ వద్దే రూ.2 వేల కోట్ల మేర అక్రమ సంపాదన ఉన్నట్టు వెల్లడైతే, చంద్రబాబును విచారిస్తే రూ.2 లక్షల కోట్లు బయటపడొచ్చని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని దోపిడీ చేసి, ఆ సొమ్మంతా విదేశాల్లో దాచారని ఆరోపించారు. ప్రతిసారి ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు చూపించి విచారించుకోవచ్చనే చంద్రబాబు ఈసారి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

More Telugu News