ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం జగన్

14-02-2020 Fri 16:38
  • గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన జగన్
  • ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ 
  • ఇవాళ రాత్రికి ఢిల్లీలో బస చేయనున్న జగన్ 
AP CM Jagan leaves for delhi

ఏపీ సీఎం జగన్  కొద్ది సేపటి క్రితం ఢిల్లీ పయనమయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే ఆయన బస చేయనున్నారు.