Sensex: ఈ వారాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు 

  • 202 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 61 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతం వరకు నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు
Stock markets decline for second straight day

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. వరుసగా రెండో రోజు నష్టపోయాయి. టెలికాం, ఎనర్జీ, టెక్ సూచీలు మినహా మిగిలినవన్నీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 41,257కు పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 12,113 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (4.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.86%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.77%), టెక్ మహీంద్రా (0.69%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.38%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-3.26%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.41%), హీరో మోటో కార్ప్ (-2.24%), ఎన్టీపీసీ (-2.00%).

More Telugu News