Chandrababu: ఐటీ దాడుల నేపథ్యంలో.. చంద్రబాబు, లోకేశ్ లపై వైసీపీ మంత్రుల అవినీతి ఆరోపణలు!

  • ఐటీ దాడులపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు
  • మనీ లాండరింగ్ లో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్న అవంతి
  • చంద్రబాబు అవినీతి ఐటీ సోదాలతో తేలిపోయిందన్న కన్నబాబు
YCP Ministers slams Chandrababu and Lokesh

ఏపీలో కొన్నిరోజులుగా అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా, ఐటీ దాడుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, ఆయన తనయుడు నారా లోకేశ్ పైనా వైసీపీ మంత్రులు ధ్వజమెత్తారు. మంత్రి శ్రీ రంగనాథ రాజు వ్యాఖ్యానిస్తూ, అప్పటి సీఎం వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తి నివాసంలో 6 రోజుల పాటు సోదాలు జరపడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. నష్టాల్లో ఉన్న లోకేశ్ కంపెనీల విలువ ఎలా పెరిగిందని ప్రశ్నించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ, మనీలాండరింగ్ లో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. పోలవరం, పట్టిసీమల్లో చంద్రబాబుది భారీ అవినీతి అని ఆరోపించారు.

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సైతం ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత దోచుకున్నారో ఐటీ సోదాలతో తేలిపోయిందని అన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా స్పందించారు. చంద్రబాబు అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రతి ప్రాజెక్టులోనూ చినబాబుకు కమీషన్లు ముట్టాయని ఆరోపించారు.

More Telugu News