ప్రేమ విఫలమైందని.. ప్రేమికుల రోజే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

14-02-2020 Fri 12:57
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘటన
  • ఇంట్లో ఉరి వేసుకున్న కుర్రాడు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు 
degree student suicide in kurnool

ప్రేమికులంతా వాలెంటైన్స్‌ సందర్భంగా పండుగ చేసుకుంటోన్న నేపథ్యంలో ఓ ప్రేమికుడు మాత్రం తన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది.

కృష్ణ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. అతడు ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.