ఈ సాంగ్ మామూలుగా ట్రెండ్ అవ్వదు: పవన్ కల్యాణ్ కొత్త సినిమా పాటపై రామ జోగయ్య శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

14-02-2020 Fri 12:46
  • 'లాయర్ సాబ్‌'గా పవర్ స్టార్ 
  • 'రాసుకోరా సాంబ' అంటూ పాట గురించి రామ జోగయ్య శాస్త్రి ట్వీట్
  • సంగీతం అందిస్తోన్న థమన్
Ramajogaiah Sastry  on pawan new movie song

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా 'లాయర్ సాబ్‌' కోసం సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి ఓ పాటను రాసినట్లు తెలుస్తోంది. 'రాసుకోరా సాంబ.. ఈ పాట మామూలుగా ట్రెండ్ అవ్వదు' అంటూ ఆయన ఓ ట్వీట్ చేసి, పవన్ కల్యాణ్‌ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయంపై థమన్ ఓ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ 26వ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఓ పాటను పాడారని, అది అందరికీ కచ్చితంగా నచ్చుతుందని, ఇందుకోసం మా హార్ట్ అండ్ సోల్‌ పెట్టామని చెప్పారు. దీనిపైనే స్పందించిన రామ జోగయ్య శాస్త్రి  ఈ పాట మామూలుగా ట్రెండ్ అవ్వదు అంటూ స్పందించారు.  

థమన్, సిద్ శ్రీరామ్ కాంబినేషన్‌ ఇటీవల వచ్చిన సామజ వరగమన పాటకు అద్భుత స్పందన వచ్చింది. పవన్ కోసం థమన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరోసారి సంగీతంతో మెస్మరైజ్ చేయాలనుకుంటున్నారు.  హిందీలో భారీ విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌గా లాయర్ సాబ్‌  చిత్రం రూపుదిద్దుకుంటోంది. మేలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.