ఆర్జేడీకి షాక్... నితీశ్ తో భేటీ అయిన లాలూ వియ్యంకుడు!

14-02-2020 Fri 12:09
  • తేజ్ ప్రతాప్ కు కుమార్తెనిచ్చిన చంద్రికారాయ్
  • వారు విడిపోయిన తరువాత నెమ్మదిగా దూరం
  • తాజాగా జేడీయూలో చేరేందుకు ప్రయత్నాలు
Chandrika Roy Meeting with Nitish Kumar

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆర్జేడీకి లాలూ ప్రసాద్ యాదవ్ వియ్యంకుడు చంద్రికారాయ్ షాకిచ్చారు. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ కు తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించిన చంద్రికారాయ్, ఇప్పుడు నితీశ్ నేతృత్వంలోని జేడీయూ వైపు చూస్తున్నారు.

కుమార్తె వివాహం చెడిపోయినా, లాలూతో సత్సంబంధాలనే నడుపుతూ వచ్చిన ఆయన, తాజాగా, నితీశ్ కుమార్ ను కలిసి చర్చలు జరపడం, బీహార్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన త్వరలోనే జేడీయూలో చేరనున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఆర్జేడీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ చంద్రికా రాయ్ పాల్గొనలేదు. అప్పటి నుంచే ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుండగా, తాజా పరిణామాలు దాన్ని ఖరారు చేస్తున్నాయి.