ప్రేమికుల రోజు.. ఆపై సుష్మా స్వరాజ్ జయంతి.. హృదయాలను ద్రవింపచేసే ఫొటో పోస్ట్ చేసిన భర్త కౌశల్

14-02-2020 Fri 11:21
  • కౌశిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సుష్మా స్వరాజ్‌
  • గతంలో తీసిన ఫొటో పోస్ట్ చేసిన కౌశిక్
  • చిరునవ్వులు చిందిస్తూ కేక్ కట్ చేసిన సుష్మా
On Sushma Swarajs birthday her husbands warm message for late leader

కేంద్ర మాజీ మంత్రి, దివంతగ సుష్మాస్వరాజ్ భర్త, మిజోరాం మాజీ గవర్నర్‌ స్వరాజ్ కౌశల్ పోస్టు చేసిన ఓ ఫొటో నెటిజన్ల హృదయాలను ద్రవింపచేస్తోంది. ఈ రోజు సుష్మా స్వరాజ్ 68వ జయంతి అన్న విషయం తెలిసిందే. అలాగే, ఈ రోజు వాలెంటెన్స్‌ డే కూడా ఉంది.

గతంలో తన ముందు కేక్‌ కట్‌ చేసి సుష్మా చిరునవ్వులు చిందిస్తుండగా ఆయన ఫొటో తీశారు. ఆ ఫొటోనే ఈ రోజు పోస్ట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు.. మా జీవితాల్లోని సంతోషం నువ్వే’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్టు చూస్తోన్న ఆమె అభిమానులు, నెటిజన్లు భావోద్వేగపూరితంగా కామెంట్లు చేస్తున్నారు.

సుష్మా స్వరాజ్‌, కౌశిక్‌లది ప్రేమ వివాహం. సుష్మా స్వరాజ్‌ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్‌ కౌశల్‌ని పెళ్లి చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. గత ఏడాది ఆగస్టు 6న సుష్మా స్వరాజ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు.