'అన్నయ్యా... వదిన వచ్చింది'... తెగ నవ్వులు పూయిస్తున్న సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ వీడియో ఇదిగో!

14-02-2020 Fri 11:08
  • కార్తీక్ పుట్ బాల్ ఆడుతుంటే వచ్చిన సారా
  • వదిన వచ్చిందని చెప్పగానే బుంగమూతి పెట్టిన సారా
  • తాజాగా వీడియోను పోస్ట్ చేసిన కార్తీక్ ఆర్యన్
Bhayya Bhabi aagaya

బాలీవుడ్ యువ జంట కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ ల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని సినీ వర్గాలు కోడై కూస్తున్న వేళ, తాజా వీడియో ఒకటి తెగ నవ్వులు పూయిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన 'లవ్ ఆజ్ కల్ - 2' నేడు వెండి తెరలను తాకింది. ఈ నేపథ్యంలో కార్తీక్ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఇద్దరు అబ్బాయిలతో కలిసి కార్తీక్ ఫుట్ బాల్ ఆడుతూ ఉండగా, వెనుక నుంచి సారా వచ్చింది. దీన్ని చూసిన ఓ బాలుడు... "అన్నయ్యా... వదిన వచ్చింది చూడు" అని చెప్పగానే కార్తీక్ ఒకింత షాక్ నకు గురయ్యాడు. ఇది విన్న సారా నవ్వుతూనే... 'వదినా' అని ఎవరు పిలిచారు? అని బాలుడి వైపు వెళుతూ... "అతనే కదా నిన్ను అలా పిలవమన్నాడు" అంటూ కార్తీక్ ను కొట్టేందుకు ప్రయత్నించింది.

ఇక ఈ వీడియోను షేర్ చేసిన కార్తీక్, దానికి సారా బుంగమూతి పెట్టుకున్న ఎమోజీని జత చేయగా, ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో ఓ కార్యక్రమంలో సారాను తన చేతులతో ఎత్తుకున్న కార్తీక్, ఆమెను స్టేజ్ పైకి తీసుకెళ్లాడు. ఆపై కార్తీక్ కు స్వయంగా వంట చేసి తినిపిస్తున్న సారా వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. దీంతో సహజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నారని అభిమానులు అంటుండగా, తమ మధ్య ప్రేమ విషయమై ఇంకా వీరిద్దరిలో ఎవరూ నోరు మెదపలేదు.






View this post on Instagram









Bhabhi kisko bola ☺️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on