Vijay mallya: చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి: విజయ్ మాల్యా

  • ఆస్తుల కోసం అటు ఈడీ, ఇటు బ్యాంకులు పోరాడుతున్నాయి
  • అసలులో వందకు వందశాతం వెనక్కి తీసుకోండి
  • మనీలాండరింగ్ మోసాలకు పాల్పడలేదు
Vijay Mallya request banks to take back their principal amount

వేలకోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా డబ్బులు వెనక్కి తీసుకోవాలంటూ భారత్‌లోని బ్యాంకులకు మొరపెట్టుకున్నాడు. విచారణ కోసం నిన్న లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌కు హాజరైన మాల్యా అనంతరం మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన అసలులో వందకు వంద శాతాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను కోరాడు. ఈ విషయంలో చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నాడు.

తీసుకున్న రుణాలను చెల్లించలేదని మాత్రమే బ్యాంకులు ఈడీకి ఫిర్యాదు చేశాయని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తానెటువంటి నేరాలకు పాల్పడలేదని స్పష్టం చేశాడు. అయితే, ఈడీ మాత్రం తన ఆస్తులను జప్తు చేసిందని మాల్యా ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే రకమైన ఆస్తుల కోసం ఓ వైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయని పేర్కొన్న మాల్యా.. బ్యాంకులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవాలని కోరాడు.

More Telugu News