తిరుమలలో అంతంతమాత్రంగా భక్తుల రద్దీ!

14-02-2020 Fri 09:31
  • 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • 8 గంటల్లోపే దర్శనం
  • నిన్న దర్శించుకున్న 68,410 మంది భక్తులు
Normal Rush in Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి గరిష్ఠంగా 6 నుంచి 8 గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం చేయిస్తున్నామని అన్నారు. నిన్న స్వామివారిని 68, 410 మంది భక్తులు దర్శించుకున్నారని, 25,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా 2.32 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.