సెల్ఫీలకు పోజులిచ్చి బంగారు కడియం పోగొట్టుకున్న తెలంగాణ మంత్రి

14-02-2020 Fri 08:04
  • మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో ఘటన
  • పెళ్లికి హాజరైన మంత్రితో సెల్ఫీలకు అభిమానుల పోటీ
  • సందట్లో సడేమియాగా కొట్టేసిన బంగారు కడియం
Minister Srinivas Gouds hand ring stolen

అభిమానులతో కలిసి సెల్ఫీ దిగిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన చేతి బంగారు కడియాన్ని పోగొట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. స్థానికంగా జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రిని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం క్యూకట్టారు. వారిని నిరాశపరచడం ఇష్టంలేని మంత్రి వారితో ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత చూసుకుంటే ఆయన చేతికి ఉండాల్సిన బంగారు కడియం మాయమైంది. దీంతో విస్తుపోవడం మంత్రిగారిపనైంది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కడియం మంత్రికి సెంటిమెంట్ కావడంతో ఎవరైనా తీసి ఉంటే ఇచ్చేయాలని పోలీసులు బతిమాలుకోవడం కనిపించింది.