ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సల్ నియామకం

13-02-2020 Thu 21:58
  • 1988 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి
  • ప్రస్తుతం పెట్రోలియం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా విధులు
  • బన్సల్ నియామకానికి ఆమోదం తెలిపిన అపాయింట్స్ మెంట్ కమిటీ
senior IAS officer Rajiv Bansal Appointed Air India CMD

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) నియామకం జరిగింది. సీనియర్ అధికారి రాజీవ్ బన్సల్ ను సీఎండీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సీఎండీగా ఉన్న ఆశ్వనీ లోహానీ పదవీకాలం పూర్తి కావడంతో కొత్త సీఎండీని నియమించారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ బన్సల్ 1988 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్ కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాగా, ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సల్ నియామకాన్ని అపాయింట్ మెంట్స్ కమిటీ కూడా ఆమోదించింది.