ఈ నెల 19 నుంచి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నాం: చంద్రబాబునాయుడు

13-02-2020 Thu 21:48
  • ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ప్రారంభిస్తాం
  • వైసీపీ పాలనలో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు
  • తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదు
Chandrababu announces from 19th Praja Chaitanya Yatra

వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనను నిరసిస్తూ ఈ నెల 19 నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. కేసులు ఎక్కడ బనాయిస్తారోనని ప్రజలు, వ్యాపారులు భయపడుతున్నారని, రెండు వందల మంది పోలీసులకు తొమ్మిది నెలలుగా జీతాలు లేని పరిస్థితి అని, వైసీపీ తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శలు గుప్పించారు. సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తే పోలీస్ అధికారుల సంఘం స్పందించదా? అని ప్రశ్నించారు.