Raj Tarun: ఆకట్టుకుంటున్న 'ఒరేయ్ బుజ్జిగా' ఫస్టులుక్

  • రాజ్ తరుణ్ హీరోగా 'ఒరేయ్ బుజ్జిగా'
  • కీలకమైన పాత్రలో వాణి విశ్వనాథ్ 
  •  వేసవిలో ప్రేక్షకుల ముందుకు

రాజ్ తరుణ్ కథానాయకుడిగా దర్శకుడు కొండా విజయ్ కుమార్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాను రూపొందిస్తున్నాడు. పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా మాళవిక నాయర్ .. మరో కథానాయికగా హెబ్బా పటేల్ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రాజ్ తరుణ్ ను మాళవిక క్రికెట్ బ్యాట్ తో కొట్టబోతున్నట్టు .. కత్తితో దాడి చేస్తున్నట్టు సరదా సన్నివేశాలతో ఈ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ ను బట్టి, ఇది ఒక అల్లరి ప్రేమకథ అనే విషయం అర్థమవుతోంది. ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్ నరేశ్ .. పోసాని కనిపించనున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్న రాజ్ తరుణ్ కి, ఈ సినిమా అయినా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

More Telugu News