tom and jerry: 'టామ్ అండ్ జెర్రీ'కి 80 ఏళ్లు.. మొట్టమొదటి వీడియో ఇదిగో!

  • 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్‌ అండ్ జెర్రీ'
  • అప్పట్లో దీని పేరు 'ది మిడ్‌నైట్‌ స్నాక్‌'
  • 'పస్ గెట్స్ ది బూట్' ఎపిసోడ్ పేరుతో మొట్టమొదటి షార్ట్‌ ఫిలిమ్

'టామ్‌ అండ్ జెర్రీ'... ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ప్రోగ్రాం. టీవీల్లో ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు.. ఇక చిన్నారులు ఎగిరిగంతులు వేస్తారు. ఇందులో ఎలుక, పిల్లి కలిసి పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ప్రేక్షకులకు ఈ 'టామ్‌ అండ్ జెర్రీ' పరిచయమై నేటికి 80 ఏళ్లు.

1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్‌ అండ్ జెర్రీ' ప్రసారమైంది. అయితే, అప్పట్లో ఇది 'టామ్‌ అండ్ జెర్రీ' పేరుతో కాకుండా 'ది మిడ్‌నైట్‌ స్నాక్‌' పేరుతో వచ్చింది. 'పస్ గెట్స్ ది బూట్' ఎపిసోడ్ పేరుతో మొట్టమొదటి షార్ట్‌ ఫిలిమ్ విడుదలైంది. పిల్లి పేరు జాస్పర్‌గా, ఎలుక పేరు జింక్స్‌గా అప్పట్లో రూపొందించారు.

ఆ తర్వాతి ఏడాది నుంచి దీని పేరు 'టామ్‌ అండ్ జెర్రీ'గా మారింది. చిన్నారులతో పాటు పెద్దలూ ఇష్టంగా చూసే 'టామ్‌ అండ్ జెర్రీ' సృష్టికర్తలు విలియం హన్నా, జోసెఫ్‌ బార్బారా. 1940లో 'ది మిడ్‌నైట్‌ స్నాక్‌' గా మొదలు పెట్టి 1958 వరకు మొత్తం 114 ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ సినిమాలను రూపొందించారు. వీరికి ఏడు ఆస్కార్‌ అవార్డులు దక్కాయి. టామ్‌ అండ్‌ జెర్రీ 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ పిల్లి, ఎలుకలను నెటిజన్లు గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.

 ఈ 'టామ్‌ అండ్ జెర్రీ' పరిచయమై నేటికి 80 ఏళ్లు అవుతోన్న సందర్భంగా మొట్టమొదటి ఎపిపోడ్ చూద్దాం.

More Telugu News