Naga Chaitanya: చైతూ నెక్స్ట్ మూవీ టైటిల్ 'నాగేశ్వర్రావ్'

  • శేఖర్ కమ్ముల సినిమాతో బిజీగా చైతూ
  • తరువాత సినిమా పరశురామ్ తో
  • ఈ కాంబినేషన్ పట్ల అందరిలో ఆసక్తి

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రేమ నేపథ్యంలో .. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. లవ్ .. ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చైతూకి కలిసొస్తుండటంతో, ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు.

'గీత గోవిందం' తరువాత పరశురామ్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి 'నాగేశ్వర్రావ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ చాలా వేగంగా జనంలోకి వెళుతుంది గనుక, దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరశురామ్ తయారు చేసుకున్న ఈ కథ కూడా ప్రేమకథా నేపథ్యంలో సాగేదే. ఈ సినిమాలో కథానాయిక ఎవరు? ప్రతి నాయకుడు ఎవరు? అనే విషయాలతో పాటు మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News