Gadde Rammohan: పెన్షన్ రద్దు చేస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎలా బతుకుతారు?: గద్దె రామ్మోహన్

  • జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు
  • వైసీపీ వాళ్లు తప్ప ఆయనకు మరెవరూ కనిపించడం లేదు
  • జగన్ కు ప్రజలే గుణపాఠం చెపుతారు

రాష్ట్రంలో వైసీపీ పాలన అరాచకంగా కొనసాగుతోందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. పాలనను పక్కనపెట్టి ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్లను తొలగిస్తున్నారని... పెన్షన్లు లేకపోతే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.

వీరంతా ఆత్మస్థైర్యంతో బతకాలని రూ. 200లుగా ఉన్న పెన్షన్ ను టీడీపీ రూ. 2,000లకు పెంచిందని చెప్పారు. జగన్ కు సొంత పార్టీ వారు తప్ప మరెవరూ కనిపించడం లేదని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే జగన్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని తెలిపారు. పెన్షన్ల తొలగింపుపై టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, వృద్ధులు, వికలాంగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

More Telugu News