Green Tree Frog: ఎంత ఆకలేసిందో ఏమో... భయంకర విష సర్పాన్ని గుటుక్కున మింగేసిన కప్ప!

  • ఆస్ట్రేలియాలో ఘటన
  • పాముతో పోరాడి మరీ మింగిన గ్రీన్ ట్రీ ఫ్రాగ్
  • వైరల్ అవుతున్న ఫొటోలు

సాధారణంగా కప్పలు పాములకు ఆహారం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, ఈ వార్త మాత్రం అందుకు వ్యతిరేకం. ఓ కప్ప పామును అమాంతం మింగేసింది. అది కూడా మామూలు సర్పం కాదు. అత్యంత విషపూరితమైన పాము. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరుగగా, పామును కప్ప మింగుతున్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో గ్రీన్ ట్రీ ఫ్రాగ్ రకానికి చెందిన ఓ కప్ప, తనకు ఎదురుపడ్డ పాముతో పోరాడి మరీ దాన్ని మింగేసింది. ఈ క్రమంలో పాము పలుమార్లు కప్పను కాటేసింది కూడా. అయితే, ఆ కప్పకు బాగా ఆకలేసి వుండవచ్చని, అందుకే అది పోరాడి మరీ, ఆహారంగా పామును మింగిందని జంతు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News