Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మూడు సాయుధ మహిళా పోలీసు బెటాలియన్లు

  • ప్రారంభించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
  • ఇకపై మహిళల రక్షణ బాధ్యత వీరిదే
  • గోరఖ్ పూర్‌, లక్నో, బడౌన్‌లలో ఏర్పాటు

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భద్రతా విభాగంలో సరికొత్త అంకానికి తెరతీసింది. మహిళలతో ప్రత్యేకంగా మూడు పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేస్తోంది. ఇకపై మహిళల రక్షణకు ప్రధానంగా వీరినే ఉపయోగించనున్నారు. గోరఖ్‌పూర్‌, లక్నో, బడౌన్‌ నగరాల్లో ఈ బెటాలియన్లు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. తొలి బెటాలియన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఈ ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్నో, బడౌన్‌ నగరాల్లో కూడా వెనువెంటనే  బెటాలియన్లు ఏర్పాటవుతాయని చెప్పారు.

More Telugu News