Chiranjeevi: నక్సలైట్ గా కనిపించనున్న చరణ్?

  • షూటింగు దశలో కొరటాల సినిమా 
  • ప్రత్యేక పాత్రలో కనిపించనున్న చరణ్ 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి

ప్రస్తుతం చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం వరకూ పూర్తి చేసుకుంది. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత కొరటాల - చిరంజీవి కాంబినేషన్లోని సినిమా కోసం చరణ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది.

ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం చరణ్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. చిరంజీవి పాత్ర యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ పాత్ర ఏమిటా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో ఆయన ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. తెరపై చరణ్ కనిపించేది కొంతసేపే అయినా ఆ పాత్ర ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి 'ఆచార్య' అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా, కథానాయికగా 'త్రిష' పేరు వినిపిస్తోంది.

More Telugu News