Sajjala: ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీని దెబ్బతీసేందుకే నిఘా వ్యవస్థను ఉపయోగించారు: సజ్జల

  • ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సజ్జల వ్యాఖ్యలు
  • ఏబీ కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేశాడని ఆరోపణ
  • ఎమ్మెల్యేల కొనుగోలులో దళారీ పాత్ర పోషించాడని వెల్లడి

ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏబీ వెంకటేశ్వరరావు మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపించారు.

అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీని బలహీనపరిచేందుకే నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారని, ఈ క్రమంలో ఓ ఫోన్ ట్యాపింగ్ మాఫియాను నడిపారని విమర్శించారు. తనతో పాటు అనేక మంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని వెల్లడించారు. ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన ఆయన కేవలం చంద్రబాబు ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారని ఆరోపించారు.

More Telugu News