CPI Narayana: సీఎం జగన్ తీరు మారకపోతే పతనం తప్పదు: సీపీఐ నారాయణ

  • రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 39 మంది మృతి  
  • ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలి
  • జగన్ కు పక్కా ఏజెంట్ జీవీఎల్

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో దీక్ష చేస్తున్న రైతులు, యువకులను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇవాళ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ తీరు మారకపోతే పతనం తప్పదని హెచ్చరించారు. అమరావతిని తరలిస్తారన్న ఆందోళనతో రాజధాని ప్రాంతంలో ముప్పై తొమ్మిది ఇప్పటికే మృతి చెందారని, ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు పక్కా ఏజెంట్ గా జీవీఎల్ పనిచేస్తున్నారని  ఆరోపించారు. బీజేపీ నుంచి జీవీఎల్ ను తప్పిస్తే కనుక ఆ పార్టీని నమ్మొచ్చని, లేనిపక్షంలో బీజేపీయే ఈ నాటాకాలు ఆడిస్తోందని భావిస్తామని వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమాన్ని కొనసాగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని, రాజకీయ పోరాటంలో తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజధాని  అమరావతి సమస్య కేవలం 29 గ్రామాల ఉద్యమం కాదని, ఐదు కోట్ల మంది కోసం చేస్తున్న పోరాటమని అన్నారు.

More Telugu News