Yanamala: ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం: యనమల రామకృష్ణుడు

  • ఉద్యోగులకు  రాజకీయాలు ఆపాదించొద్దు
  • నెలల తరబడి పోస్టింగ్స్ లేకుండా ఉంచొద్దు
  • ఇలాంటి దుర్మార్గులను ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలి

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. గత ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగులపై కక్ష సాధించడం గర్హనీయమని అన్నారు. ఉద్యోగులకు రాజకీయాలు ఆపాదించొద్దని, నెలల తరబడి పోస్టింగ్స్ లేకుండా వెయిటింగ్ లో ఉంచొద్దని సూచించారు. ఒక వ్యక్తిపై కక్ష సాధింపు కోసం రాష్ట్ర్రాన్ని పణంగా పెడుతున్నారంటూ సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దుర్మార్గులను ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు.

More Telugu News